ఫుట్‌బాల్ ఆడుతూ గాయ‌ప‌డ్డ ర‌ణ్‌భీర్ క‌పూర్

బాలీవుడ్ చాక్లెట్ హీరో ర‌ణ్‌భీర్ క‌పూర్ ఫుట్ బాల్ ఆడుతూ గాయ‌ప‌డ్డాడు. ఇబ్ర‌హీం అలీ ఖాన్, ఇషాన్ ఖ‌త్త‌ర్‌తో పాటు ప‌లువురితో క‌లిసి ర‌ణ్‌భీర్ ముంబైలో ఫుట్ బాల్ ఆడారు. అయితే అనుకోకుండా ఆయ‌న ముఖానికి, పెద‌వులకి చిన్న‌పాటి గాయాలు అయ్యాయి. బ‌య‌టికి చిన్న గాయాల‌లా క‌నిపిస్తున్నా , చాలా పెద్ద‌గానే త‌గిలిందని త‌న తోటి స్నేహితుల‌కి చెబుతున్నాడు ర‌ణ్‌బీర్. ఈ మాటలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అయితే ర‌ణ్‌భీర్ ఫుట్ బాల్ ఆడుతున్న విష‌యం గ‌మ‌నించిన స్థానికులు ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు చాలా సేప‌టి నుండి అక్క‌డే వెయిట్ చేశారు. ఇది గ‌మ‌నించిన ర‌ణ్‌బీర్ వారిని నిరాశ‌ప‌ర‌చ‌డం ఇష్టం లేక దెబ్బ‌ల‌తోనే సెల్ఫీలు దిగారు. ర‌ణ్‌భీర్ మంచిత‌నాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఈ హీరో బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉన్నాడు.