టెస్టుల్లోనూ కోహ్లీనే నంబర్‌వన్‌

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ(928పాయింట్లు) తొలి ర్యాంకులో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌(911) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 17 మాత్రమే కావడం విశేషం. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(864) మూడు, భారత టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(791) నాలుగులో ఉన్నాడు. టెస్టు వైస్‌ కెప్టెన్‌ రహానె ఒక ర్యాంకు పడిపోయి ఏడో స్థానంలో నిలిచాడు.